వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో బుధవారం ప్రత్యేక గ్రామసభ విజయవంతంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్, సర్పంచ్ శారద సురేష్ నాయక్ ఈ విషయాన్ని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సభను నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ శారదా సురేష్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొగులాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్థులు, ప్రజలు పాల్గొన్నారు.