హనుమాన్ జయంతి: న్యాయమూర్తి శిరీష ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు

వనపర్తి జిల్లా, ఆత్మకూరు పట్టణంలోని కేశవ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జె. శిరీష సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు న్యాయమూర్తిని శేషావస్త్రంతో సత్కరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నిర్వాహకులు అన్నదానం, భజన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్