వనపర్తి ఎస్సీ హాస్టల్లో అమరవీరుల స్మరణ, గాంధీకి నివాళి

వనపర్తిలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం (బి)లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, వసతి గృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ విద్యార్థులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల త్యాగాలను వివరిస్తూ, మహాత్మా గాంధీ ప్రపంచానికి అందించిన అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం వంటి మహత్తర ఆలోచనలు నేటికీ మార్గదర్శకాలని తెలిపారు. విద్యార్థులు ఈ విలువలను ఆచరిస్తూ మహనీయుల స్ఫూర్తితో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్