మంత్రి శ్రీహరి ఆత్మకూరులో పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు

మంగళవారం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో వెలసిన పెద్దమ్మతల్లిని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్