బలిజపల్లి గ్రామంలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలోని రైతు వేదికలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి జిల్లా, పాలెం కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో డీఎవో, ఏవో, ఏఈఓలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు హాజరై, మంత్రి సూచనలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్