వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన ఓమోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ తర్వాత వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వాన పడింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల కారణంగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.