వనపర్తి జిల్లా, వనపర్తిలోని మదనపురం మండల కేంద్రంలో శనివారం, ప్రపంచ శాంతి కోసం ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని మాజీ ఎంపీపీ మహదేవన్ గౌడ్ కోరారు. హజ్ యాత్రకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ కరీంను ఆయన ఘనంగా సన్మానించి, శాలువా, పూలమాలలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.