రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ మాట్లాడుతూ, 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. 2025లో వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలు గణనీయంగా పురోగతి సాధించాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం, అధికారులతో కలిసి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.