పెద్దమ్మ పండుగ: ఆత్మకూరులో పోలీసుల భారీ బందోబస్తు

ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగే పెద్దమ్మ పండుగ సందర్భంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై విజయన్న నేతృత్వంలో పోలీసు బెటాలియన్ పట్టణంలో కవాతు నిర్వహించింది. సీఐ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ పండుగ నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేశారు.

సంబంధిత పోస్ట్