వనపర్తిలో పందుల చోరీ.. కేసు నమోదు

వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పెంచుతున్న 21 పందులను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీ చేశారు. దీంతో పందుల పెంపకదారుడు అచ్యుతాపురానికి చెందిన సిరివాటి రంగన్న శుక్రవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్