పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలి.. కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని ఆదివారం సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ చుక్కలు పిల్లల ఆరోగ్యానికి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్