ఆత్మకూరులో పల్స్ పోలియో కార్యక్రమం

వనపర్తి జిల్లా, వనపర్తిలోని ఆత్మకూరులో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ నాగమణి, కమిషనర్ సురేశ్ కుమార్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పలు కేంద్రాల్లో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నాగమణి తెలిపారు. పుట్టిన బిడ్డల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పక వేయించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్