ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు: ఆధార్ సీడింగ్ వెంటనే పూర్తి చేయాలి

వనపర్తి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. మల్లికార్జున్, వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, శ్రీ సూర్య, శ్రీ చైతన్య ఒకేషనల్ కాలేజీలను సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన ఆధార్ సీడింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, ఎస్సీ విద్యార్థుల కొత్త అప్లికేషన్లను నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి, జూనియర్ అసిస్టెంట్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్