వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామం ముందరితాండలో శుక్రవారం రాత్రి సీతమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. లంబాడీ (బంజారా) గిరిజనులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ సాంప్రదాయ పండుగను 'సీత్ల' (సీతమ్మ) పండుగ లేదా 'సీత్ల యాడి' (సీతమ్మ తల్లి) పూజ అని కూడా పిలుస్తారు. బంజారా సంప్రదాయ దుస్తులు ధరించి, వారి ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించారు. భక్తులు టెంకాయలు కొట్టి, స్వీట్లు పంచి, అన్నదానం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.