ఆత్మకూరు మున్సిపాలిటీలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా 50 శాతం పారాల పంపిణీ పూర్తయిందని కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. గ్రామ దేవత ఉత్సవాల కారణంగా ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని, అయితే త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో బీఎల్వోలకు రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.