అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా గంధం నాగరాజు నియామకం

ఏప్రిల్ నెలలో జరగనున్న బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా గంధం నాగరాజు ఆదివారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా, వనపర్తిలోని రేడియంట్ హై స్కూల్‌లో ఆదివారం ఆయనను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. మహనీయుల జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, సమాజ అభ్యున్నతి కోసం తపించిన వారి మార్గం అనుసరణీయమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర చంద్ర శేఖర్, దేశి రాములు యాదవ్, బైరోజు చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్