చెన్నూరులో విషాదం: సర్పంచ్ ఆర్థిక సాయం

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కావలి నాగమ్మ అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దురదృష్టకర సంఘటనలో, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు బిఆర్ఎస్ సర్పంచ్ శారద సురేష్ నాయక్, గ్రామ పెద్దలతో కలిసి రూ.5 వేల నగదును సోమవారం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నారాయణరావు, రాంబాబు, వార్ల రాములు, ఎరుకలి బాలస్వామి, చిన్న వెంకటయ్య గౌడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్