వనపర్తి: 10వ తరగతి ఉత్తీర్ణత... క్రికెట్ ఆడుతూ మృతి!

వనపర్తి జిల్లా ఖిల్లా గణపూర్ మండలం సోళీపూర్ గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి ఫలితాల్లో 441 మార్కులు సాధించిన 15 ఏళ్ల చింతకాయల భరత్, స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బతో కుప్పకూలి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్