వనపర్తి జిల్లాలో రోడ్ల విస్తరణ, మార్కెట్ సముదాయం, మహిళా అగ్రికల్చర్ కళాశాల, జిల్లా ఏర్పాటు, ఐటీ టవర్, జేఎన్టీయూ కళాశాల వంటి అభివృద్ధి పనులను నిరంజన్ రెడ్డి తెచ్చారని, 10 ఏళ్లలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించారని మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పేర్కొన్నారు. నిజమైన అభివృద్ధికి, విధ్వంస పాలనకు మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు నిరంజన్ రెడ్డికి అండగా నిలవాలని ఆయన బుధవారం విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.