వనపర్తి రూరల్ మండలం చిట్యాల మార్కెట్ యార్డు సమీపంలోని మారం బాలకృష్ణ ఇంట్లోకి గురువారం 9 అడుగుల భారీ జెర్రిపోతు పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణసాగర్ తన బృందంతో కలిసి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని వారు తెలిపారు.