వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 2వ తేదీ రాత్రి పానగల్ రోడ్డులో నివసించే మహిళ పట్ల పీర్లగుట్ట ప్రాంతానికి చెందిన మదాసు భాస్కర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భాస్కర్ ను బుధవారం జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.