వనపర్తి జిల్లాలో బుధవారం జరిగిన సంఘటనలో, ఆధార్ కార్డులో ఫోటో సరిగా లేదన్న కారణంతో ఒక వృద్ధురాలిని కండక్టర్ బస్సులోంచి దించేసి, ఆమె సామానును కాలితో బయటకు తన్నాడు. నాగర్ కర్నూల్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన వృద్ధురాలిని కండక్టర్ దుర్భాషలాడుతూ బస్సు దింపేశాడు. కండక్టర్ ప్రవర్తనపై తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.