కాంగ్రెస్ వాళ్ళకి నీళ్లు వాడుకునే ఉపాయం లేక, తెలంగాణ రైతాంగాన్ని అపాయంలోకి నెడుతున్నారని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం బిఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర జలవనరుల మంత్రితో రేవంత్ మీటింగ్ ఎందుకు రద్దు చేసుకున్నారు.? నీ గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ నీళ్ళను ఏపీకి దోచిపెట్టడం కోసమే ఆ మీటింగ్ ను రద్దు చేశారని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.