వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రైతులు భూసారం, లాభసాటి పంటల సాగు, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బుధవారం గోపాల్ పేట మండలం రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మే 4 నుంచి 9 వరకు జిల్లా వ్యాప్తంగా 'రైతు వారోత్సవాలు' నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా సాగు మెలకువలను రైతులకు చేరువ చేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.