వనపర్తి: గట్టుకాడిపల్లి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్