వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్ట్ నుంచి 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు శనివారం ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఇన్ ఫ్లో 1, 08, 867, అవుట్ ఫ్లో 1, 11, 043 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు, ప్రస్తుతం 317. 460 మీటర్లు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9. 657 టీఎంసీలు కాగా నీటి నిల్వ 8. 571 టీఎంసీలు. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.