వనపర్తి: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద.. 15 గేట్లు ఓపెన్

వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఇన్ ఫ్లో 1,78,337 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1,79,987 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.795 టీఎంసీల నిల్వ ఉంచారు. 15 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. 5 కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్