దేశంలో కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ వనపర్తి జిల్లా కోశాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా అమరచింతలో మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మికుల పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో 4 కోడ్ లుగా విభజించి నిర్వీర్యం చేశారన్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచారని కార్మిక సంఘాలు సంఘటితంగా పోరాడాలన్నారు.