వనపర్తి: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా రూరల్ మండలం గుంటూరు గ్రామంలో మంగళవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులైన భాగ్య లక్ష్మి, శారద, కావేరి, నిర్మల, మాధవి కుటుంబాలకు ఆయన నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్