వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీడీ శ్రీనివాసులు, లీగల్ సెల్ కన్వీనర్ అశోక్ రావు, మాజీ సర్పంచ్ కట్టెలమండి రాములు తదితరులు పాల్గొన్నారు.