వనపర్తి: జిల్లాలో గొర్రెల కాపరి హత్య.?

వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం చెన్నూరు గ్రామ సమీపంలో ఆదివారం బాలచంద్రి అనే గొర్రెల కాపరిని గుర్తుతెలియని దుండగులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. వనపర్తి సీఐ రత్నం, ఎస్ఐ శశిధర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతికి గల కారణాలపై ఆరా తీశారు. క్లూస్ టీం సహాయంతో అనుమానాస్పద సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్