శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతులను ఉపయోగించుకుని, తద్వారా కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ పని విభాగాల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్టేషన్ లలో కేసులు పెండింగ్ లేకుండా పనిచేయాలని అన్నారు.