ఆస్పత్రికి తరలించిన బాలికలు క్షేమంగాఉన్నారు.. ఎమ్మెల్యే

కొత్తకోట బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురై వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన 16 మంది బాలికలు క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం తెలిపారు. హాస్టల్లో మొత్తం 144 మంది బాలికలు ఉన్నారని, బయట ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రిలో బాలికలచే తప్పుడు రిపోర్టు ఇప్పించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్