శేష జీవితం కాదు విశేషమైన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన కళా సాహితీ వేదిక అధ్యక్షుడు, హెచ్ఎం శంకర్ గౌడ్ పదవీ విరమణ వీడ్కోలు సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని అన్నారు. సమాజంలో నూతన పాత్ర పోషించటానికి శంకర్ గౌడ్ సిద్ధంగా ఉండాలని అన్నారు.