వనపర్తి: నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: MLA మేఘారెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో 178 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 1.16 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నిరుపేదల అభ్యున్నతికి పాటుపడుతుందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్, ఆడబిడ్డల వివాహాల కోసం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. 1,01,116 అందజేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్