వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు నాణ్యత లేనివని, కాంగ్రెస్ నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందిస్తోందని పేర్కొన్నారు.