శ్రీరంగాపూర్ ను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో శ్రీరంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం జరిగిన రథోత్సవానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాజాకృష్ణదేవరావు తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీరంగాపూర్ మండల కేంద్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన జెండాగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్, ఛైర్మన్లు, సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్