జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నదిలో గురువారం మధ్యాహ్నం వనపర్తి మండలం, కాశీం నగర్ గ్రామానికి చెందిన ఎద్దుల వెంకటేష్ (35) అనే యువకుడు నదిలో దూకి గల్లంతయ్యాడు. తాను చనిపోతున్నానని సెల్ఫ్ వీడియో తీసి బంధువులకు పంపాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఇటిక్యాల ఎస్ఐ కే. రవి, పోలీస్ సిబ్బంది, ఎస్టిఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదు.