మహారాష్ట్ర పురపోరు.. పోలింగ్‌కు ముందే మహాయుతికి 68 సీట్లు

మహారాష్ట్ర పురపాలక ఎన్నికలలో అధికార ప్రభుత్వం ఘన విజయం సాధించింది. పోలింగ్‌కు ముందే BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి 68 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, ప్రత్యర్థి అభ్యర్థులు వైదొలగడంతో ఈ విజయం లభించింది. ఇందులో BJP 44, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 22, అజిత్‌ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్