కుటుంబ కలహాలు.. మంత్రి పీఏ భార్య ఆత్మ‌హ‌త్య‌

ముంబైలో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే పీఏ అనంత్ గార్జే భార్య గౌరీ పాల్వే కుటుంబ కలహాల నేపథ్యంలో వర్లీ ప్రాంతంలోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఆదివారం సమాచారం తెలిపారు. ఫిబ్రవరిలో వివాహం జరిగిన గౌరీ కేఈఎం ఆస్పత్రిలో డెంటల్ విభాగంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్