దేశంలో వరుసగా పేపర్ లీకేజీలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర టెట్ పరీక్ష పేపర్ లీకవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) నేత అమోల్ మాటెలె, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కెలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని విద్యావ్యవస్థ, పరీక్షా నిర్వహణ వ్యవస్థ దోపిడీ వ్యవస్థగా మారిందని, యువత భవిష్యత్తును కొల్లగొడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దయింది. ఈ పేపర్ లీకేజీపై విచారణ జరుగుతోంది.