మళ్లీ థియేటర్లలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన ‘1 నేనొక్కడినే’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ కల్ట్ సైకాలజికల్ థ్రిల్లర్‌ను మే 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. లెజెండరీ నటుడు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ విడుదలను ప్లాన్ చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రస్తుతం 4K వెర్షన్‌లో మళ్లీ విడుదల కానుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్