మహేష్ బాబు 'వారణాసి' ఏప్రిల్ 7న విడుదల!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది, శ్రీరామ నవమి, అంబేడ్కర్ జయంతి సెలవులను పురస్కరించుకుని ఈ తేదీని ఖరారు చేశారు. మహేష్ బాబు కెరీర్ లో ఏప్రిల్ నెలలో విడుదలైన 'పోకిరి', 'భరత్ అనే నేను' వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సెంటిమెంట్ తో 'వారణాసి' కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్