రంగస్థలం మహేష్‌ షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్.. వ్యక్తిగత జీవితంపై అనుమానాలు!

ప్రస్తుతం సినిమా, వెబ్ సిరీస్ ప్రమోషన్ల కోసం వినూత్న పద్ధతులు అనుసరించడం సాధారణమైంది. అయితే, నటుడు రంగస్థలం మహేష్ ఇటీవల చేసిన కొన్ని వీడియోలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. మొదట, ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్యలున్నాయని, త్వరలో అన్ని విషయాలు చెబుతానని భావోద్వేగంగా మాట్లాడారు. ఆ తర్వాత, భార్యాభర్తల వివాదాలను పరిష్కరించే కార్యక్రమానికి వెళ్లినట్లు, విడాకుల అంశంపై వాగ్వాదం జరిగినట్లు చూపించారు. ఇవన్నీ ఆయన నటించిన ‘డి ఫర్ డివోర్స్’ అనే షార్ట్ సిరీస్ ప్రమోషన్‌లో భాగమని తెలిసింది.

సంబంధిత పోస్ట్