మంటల్లో చిక్కుకున్న మహీంద్రా BE 6 కారు.. అసలు కారణాలను వెల్లడించిన సంస్థ

యూపీలో మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV కారులో మంటలు చెలరేగిన సంఘటనపై మహీంద్రా స్పందించింది. వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని, బ్యాటరీ లేదా మోటార్‌తో సమస్య లేదని కంపెనీ తెలిపింది. వెనుక కుడి టైర్ గాలిలేకుండా పోయినా, 60 కి.మీ వేగంతో 10 నిమిషాలకు పైగా ప్రయాణించడం వల్ల టైర్, రోడ్డు మధ్య ఘర్షణ జరిగి మంటలు అంటుకున్నాయని వివరించింది. ESP, TCS వంటి భద్రతా వ్యవస్థలు స్పందించి, కారును నియంత్రితంగా ఆపాయని పేర్కొంది. వినియోగదారులు భద్రతా చర్యలు, హెచ్చరికలను పాటించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్