మహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు

ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో మహీంద్రా ట్రాక్టర్స్‌ కీలక ప్రకటన చేసింది. దేశీయంగా ట్రాక్టర్ల రేట్లను పెంచుతున్నట్లు, ప్రాంతాలు, మోడల్స్‌వారీగా పెంపు ఉంటుందని పేర్కొంది. పెరిగిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. మరోవైపు, మహీంద్రా గ్రూప్‌లోనే భాగమైన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 21 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్