యజమానిని చంపి బంగారం, నగలతో పరారైన పనిమనిషి (వీడియో)

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొద్దులూరి వెంకట రామారావు(70) తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పనిలో పెట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పనిమనిషి తన భర్త సహాయంతో రామారావు ముఖంపై దిండు పెట్టి చంపేసింది. గదిలో లైటు వేసి ఉండటంతో దగ్గరకు వెళ్లి తల్లి చూడగా కొడుకు మరణించాడు. బంగారం, నగదు కోసమే హత్య చేసినట్లు సమాచారం.. పోలీసులు అనూష కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్