ఫార్మా కంపెనీలో భారీ పేలుడు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో ఇంటర్మీడియట్, బల్క్ డ్రగ్​ యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో కూడా అగ్నిప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్