ఇంగ్లాండ్‌తో మూడో టీ20కి ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో ఓటమితో భారత్ సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. దీంతో నాటింగ్‌హామ్‌లో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలనే లక్ష్యంతో శ్రేయాస్ అయ్యర్ సేన బరిలోకి దిగనుంది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కే అవకాశం ఉండగా, పేలవ ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు పేసర్‌తో బరిలోకి దిగాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.