ఇండోనేషియాలో ఉదయం 11:20 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అధికారులు ఇప్పటికే విపత్తు నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ఇంకా నష్టంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.